US Police Firing: అగ్రరాజ్యం అమెరికాలో ఓ సిక్కు యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈసందర్భంగా లాస్ ఏంజిల్స్ పోలీసులు మాట్లాడుతూ.. గురుప్రీత్ సింగ్ (36) అనే వ్యక్తిని కాల్చి చంపినట్లు తెలిపారు. ఆయన సాంప్రదాయ సిక్కు యుద్ధ కళ ‘గట్కా’ను రోడ్డుపై ప్రదర్శిస్తున్నాడు. నగరంలోని క్రిప్టో. కామ్ అరీనా సమీపంలో ఆయన గొడ్డలితో తిరుగుతున్నాడని స్థానికుల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించగా మాట వినడానికి నిరాకరించడంతో…