వరుసకు బాబాయ్.. తండ్రి తర్వాత తండ్రిలా కాపాడాల్సిన వాడు. కానీ పసిపిల్లాడిని కిరాతకంగా చంపేశాడు. మైలార్ దేవ్ పల్లి లో నాలుగు సంవత్సరాల బాలుడు లక్ష్మీ నరసింహను హత మార్చిన కసాయి బాబాయి వీరేశంను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. హంతకుడు బాలుడి తల్లి మహేశ్వరి చెల్లి భర్త. స్వయానా మరిది కావడం గమనించాల్సిన విషయం. గత కొన్ని రోజులుగా బాలుడు తల్లి మహేశ్వరి చెల్లిని వేధిస్తున్నాడు మరిది వీరేశం. భర్త వేధింపులు భరించలేక తనకు విడాకులు కావాలంటూ…
కన్నతండ్రి అంటే కనుపాపలా కాపాడాలి. కష్టమొస్తే దానిని తీర్చాలి. కానీ ఆ కన్నతండ్రి కాలయముడిలా మారాడు. రెండునెలలయినా నిండని చిన్నారిపై ప్రతాపం చూపించాడు. సభ్య సమాజం తలదించుకునే ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన మల్లికార్జున, చెట్టెమ్మలకు రెండు నెలల చిన్నారి ఉంది. చిన్నారికి ఆరోగ్యం బాగాలేదు. గురువారం సాయంత్రం చిన్నారిని హాస్పిటల్ కు తీసుకెళ్ళారు దంపతులు. భార్యను ఆస్పత్రి దగ్గర ఉండమని చెప్పి చిన్నారిని తీసుకొని భర్త…