Afghanistan-Pakistan: తాలిబన్లు, పాకిస్థాన్ దళాల మధ్య మరోసారి భీకర పోరాటం జరుగుతోంది. ఆఫ్ఘస్థాన్-పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న స్పిన్ బోల్డాక్‌లో రెండు సైన్యాలు తలబడుతున్నాయి. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో పాకిస్థాన్ దళాలు, ఆఫ్ఘన్ తాలిబన్ల మధ్య భారీ పోరాటం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.