యూపీలోని బల్‌రామ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. నిందితుడు భర్త హత్యకు ముందు హాలీవుడ్ క్రైం సినిమాను చూసి భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా.. ఆమె శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి, ఆ పార్ట్స్ ను పలు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘటన ఆగస్టు 6న జరిగింది.