Crime: వెంకటేష్ నటించిన సూపర్ హిట్ ఫిలిం ‘‘దృశ్యం’’ తరహాలో ఒక మర్డర్ జరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ తన భర్తను చంపేసి, వంటింటిలో పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడు, అతడి స్నేహితుడి సహాయంతో భర్తను చంపేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఇంటిలోని వంటగదిలో నేల కింద పూడ్చిపెట్టింది. నిందితులు హత్య చేసినట్లు ఒప్పుకున్న తర్వాత అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఘటనా స్థలం నుంచి అస్థిపంజర అవశేషాలను వెలికితీశారు.