సూర్యాపేట జిల్లాలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ను పట్టుకుని విద్యార్థులు ఏడ్చేశారు. ఈ ఘటన మద్దిరాల (మం) పోలుమల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మెంతబోయిన సైదులును పట్టుకొని విద్యార్థులు ఏడ్చేశారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం మొత్తం వరద నీటితో మునిగిపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఇవాళ (గురువారం) గ్రామ పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క కన్నీరు పెట్టారు. ఇప్పటికీ గ్రామంలో సుమారు వంద మంది ప్రమాదంలో ఉన్నారని, వారిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె వేడుకున్నారు.