టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఈనెల 26 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా జట్టు దక్షిణాఫ్రికాకు చేరుకుంది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫేస్ షీల్డులు, ఫేస్ మాస్కులతో దక్షిణాఫ్రికా చేరుకున్నట్లు బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా తమ దేశానికి చేరుకున్న తరువాత భారత క్రికెట్ జట్టు కఠినమైన నిర్బంధంలో నివసించాల్సిన అవసరం లేదని ఇప్పటికే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు పేర్కొన్న విషయం తెలిసిందే. Read…