పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2025) షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 11న రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ లీగ్‌లో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి. మే 13, 14, 16 తేదీల్లో క్వాలిఫైయర్.. ఎలిమినేటర్ 1, ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రాండ్ ఫినాలే మే 18న లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరగనుంది.