ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మొదటి నుంచి సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. నిన్న నక్సలైట్ల పేరుతో బయటికి వచ్చిన లేఖ నిజమా…?కాదా అన్నది పక్కన పెడితే సమస్యకు పరిష్కారం చర్చల ద్వారానే అవుతుందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో వీర తెలంగాణ రైతాంగ పోరాట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో పాల్గొన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు…