అమరావతి తిరుపతిలో జరిగే రాజధాని రైతుల బహిరంగ సభకు సీపీఎం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రాజధాని రైతులు తిరుపతి సభకు ఆహ్వానించారు.. మేమూ వెళ్లాలనుకున్నామన్నారు. కేంద్ర బీజేపీ నేతలు ఈ సభలకు హాజరవుతున్నారని తెలిసిందని… రాష్ట్ర ప్రయోజనాలకు హాని తలపెట్టింది బీజేపీనేనని ఆగ్రహించారు. అలాంటి బీజేపీ నేతలు పాల్గొనే సభల్లో మేం పాల్గొనబోమని.. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలనేదే సీపీఎం విధానమని గుర్తు చేశారు మధు. ఢిల్లీలో ఓ…