కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్య ప్రజలతో పాటు ఈసారి చాలామంది సెలెబ్రిటీలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నిన్న రాత్రి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని, స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని, కొద్దిరోజులుగా తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించాడు…