విశాఖపట్నంలో కోవిడ్ కేసులు ఉధృతి పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య ఎక్కువైంది. తాజాగా 10 మందికి వైరస్ నిర్దారణ అయ్యింది. దీంతో.. ఈ సీజన్‌లో కరోనా భారినపడ్డ బాధితుల సంఖ్య 38కి చేరింది. వీరిలో 25 మంది ఆస్పత్రులు, హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తోంది. తెలంగాణలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్రంలో 402 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. నాలుగు కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది… సెకండ్ డోస్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకున్న వారిపైనా కరోనా అటాక్ చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే పోలీసు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. వారం రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్…