కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై కాకినాడ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు మంత్రి ఆళ్ల నాని.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న కోవిడ్ ఆస్పత్రులు 420, ఐసియు బెడ్స్ 5,601, ఆక్సిజన్ బెడ్స్ 18,992గా ఉన్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా 3120 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. కరోనా సెకండ్ వేవ్ ని సాధ్యమైనంత మేరకు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందన్న మంత్రి.. 104 కాల్ సెంటర్ అత్యంత కీలకమైన వ్యవస్థగా సీఎం…