రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వ్యాప్తి పెరగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి ఎమర్జెన్సీ కానీ ఆపరేషన్లను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను సైతం విడుదల చేసింది. దీంతో గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కానీ ఆపరేషన్లు జరగవు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. Read Also: ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొరడా..నిబంధనలు…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.. కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు మెడికల్ సిబ్బంది కరోనా బారిన పడగా.. తాజాగా మరో 15 మంది మెడికోలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో, కాకతీయ మెడికల్ కాలేజీలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 44కు చేరుకుంది. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లతో సహా 29 మంది మెడికోలకు నిన్న మధ్యాహ్నం వరకు…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1,825 కరోనా కేసులు వెలుగు చూశాయి. అయితే నిన్నటితో పోలిస్తే.. 152 కరోనా కేసులు పెరిగాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1,825 మంది కరోనా బారిన పడ్డారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నేటి కరోనా బులిటెన్ ను కూడా విడుదల చేశారు. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో కరోనా బారిన పడి ఒకరు మృతి…
ఏపీలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. నిన్న కాస్త తగ్గిన కరోనా కేసులు ఇవాళ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 1257 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,81, 859 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో…
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా మహమ్మారి వదలడం లేదు. తాజాగా మరో ఐదుగురు మెడికోలు కరోనా బారినపడ్డారు. నిన్న 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇవాళ మరోసారి పరీక్షలు నిర్వహించగా మరో ఐదుగురికి పాజిటివ్ అని తేలింది. దీంతో కేఎంసీలో మొత్తం 22 మంది మెడికల్ విద్యార్థులు కరోనాకు గురయ్యారు. కరోనా అలజడితో అటు విద్యార్ధులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన నిట్ అధికారులు. ఇదిలా వుంటే నిట్ లోనూ కరోనా…
మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.. దీంతో కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా రాష్ట్రాలు, నైట్ కర్ఫ్యూలు, సంపూర్ణ లాక్‌డౌన్‌లు.. ప్రజలు ఎక్కువగా కలుసుకునే అవకాశం ఉన్న విందు, వినోదాలపై ఆంక్షలు.. ఇలా పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు.. తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది.. ఆదివారం అంటే ఇవాళ ఒక్కరోజు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.. అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతి లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.. అయితే, ఇవాళ ఒకేరోజుకు…
భారత్‌లో కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది.. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం భారత్‌పై ఏ స్థాయిలో ఉందో.. వరుసగా వెలుగు చూస్తున్న కొత్త కేసులే చెబుతున్నాయి.. గత ఐదు రోజులుగా ప్రతీ రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తూ.. కరోనా మీటర్ పరుగులు పెడుతోంది… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 327 మంది కోవిడ్…
కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడిప్పుడే కోలుకోని మాములు స్థితిలోకి వచ్చినా ..మళ్లీ ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ విజృంభిస్తుంది. దీంతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతునే ఉంది. అయినా ఏదో రూపంలో ఈ మహమ్మారి విరుచుకుపడుతునే ఉంది. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా తన పంజా విసురుతుంది. మరోవైపు ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు నియమ నిబంధనలు పాటించాలని ప్రజలను హెచ్చరిస్తునే ఉన్నాయి. తాజాగా..ఉత్తరఖండ్-నైనిటాల్ నవోదయ విద్యాలయంలో 85 మంది విద్యార్థులకు కోరానాపాజిటివ్…
ఒకవైపు కోవిడ్ వ్యాప్తి, మరోవైపు ఒమిక్రాన్ దాడితో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై పడింది. అందుకే భారత ప్రభుత్వం 15-18 ఏళ్ళ వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయడానికి రెడీ అయింది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసు పిల్లలకు 2022 జనవరి 3వ తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సీన్లు ఇస్తామని.. వీరు కోవిన్ యాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా కోవిడ్ వ్యాక్సీన్లకు స్లాట్లు బుక్ చేసుకోవచ్చునని కేంద్ర…
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేసుల్లో పెరుగుదలను చూస్తుంటే థర్డ్‌వేవ్ అనివార్యమనిపిస్తోందని, ఇప్పటికే థర్డ్ వేవ్ వచ్చినట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై తో పాటు అనేక పెద్ద నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనక తప్పదని, అనివార్యం అని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారని ముఖ్యమంత్రి ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనక తప్పదని అన్నారు.…