కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలామంది సెలెబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో హీరోయిన్ కు కోవిడ్-19 సోకింది. ప్రస్తుతం రవితేజతో “ఖిలాడీ” చేస్తున్న సౌత్ ఇండియన్ నటి డింపుల్ హయాతీకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అదే విషయాన్ని డింపుల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో ప్రకటించింది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనా వైరస్ బారిన పడ్డానని డింపుల్ హయాతి తన పోస్ట్‌లో రాశారు.…