తెలంగాణలో మరో మంత్రి కరోనా మహమ్మారి బారినపడ్డాడు.. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు కరోనా సోకింది.. వారిలో కొందరు ప్రాణాలు వదలగా.. చాలా మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. తాజాగా, మంత్రి గంగుల కమలాకర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. గత రెండు రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతున్న మంత్రికి.. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది.. దీంతో.. హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయిన మంత్రి గంగుల కమలాకర్.. ఈ మధ్య తనను కలిసినవారు,…
టీమిండియాను కరోనా వేంటాడుతోంది. టీమిండియా కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కరోనా బారినపడడం తెలిసిందే. ఈ ముగ్గురూ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇప్పుడు టీమిండియా సహాయక బృందంలో మరొకరికి కరోనా వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లకు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేశారు. రేపు ఇంగ్లండ్‌తో ప్రారంభయ్యే చివరి ఐదో టెస్టులో కోహ్లీ సేన నేరుగా బరిలో దిగనుంది. మరోవైపు టీమిండియా సభ్యులందరికీ మరోసారి కరోనా పరీక్షలు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా అప్పుడప్పుడు పెరుగుతూనే ఉన్నాయి.. ఇక, ఇప్పటికే ఎన్నో కుటుంబాల్లో కరోనా మహమ్మారి కలకలం రేపింది.. తాజాగా, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ కుటుంబం కరోనా బారినపడింది… మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ , ఆయన సతీమణి , కుమార్తె టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ సమన్వయకర్త గౌతు శిరీషకు కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. ప్రస్తుతం వైజాగ్ లోని…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలేది లేదు అనే తరహాలో.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అందరినీ టచ్ చేస్తూనే ఉంది… ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు సోకిన వైరస్.. కొంత మంది ప్రాణాలు కూడా తీసింది.. తాజాగా.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనాబారనపడ్డారు.. గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారి లక్షణాలతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు ఎమ్మెల్యే…
కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అంతా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కూడా కరోనా వైరస్ సోకింది.. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత కాస్త నలతగా ఉండడంతో.. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ టెస్ట్‌లు చేయించుకున్నారు.. అయితే,…
ఫస్ట్ వేవ్‌లోనే చాలా మంది ప్రజాప్రతినిధులను పలకరించిపోయింది కరోనా మహమ్మారి.. కొందరు నేతలు, ప్రముఖుల ప్రాణాలు సైతం తీసింది.. తాజాగా, సెకండ్ వేవ్ కలవర పెడుతుండగా.. మరో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇవాళ ఆయన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో.. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన…