HIV Vaccine: ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు గత కొన్ని సంవత్సరాలుగా HIV వంటి ప్రమాదకరమైన వ్యాధితో పోరాడటానికి సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం వెతుకుతున్నారు. తాజాగా వ్యాక్సిన్ కనుక్కోవడంలో ఆశ కనిపించింది. ఓ ప్రయోగాత్మక వ్యాక్సిన్‌పై పరీక్ష నిర్వహించగా.. ఫలితాలు చాలా సానుకూలంగా వచ్చినట్లు చెబుతున్నారు. కానీ ఈ వ్యాక్సిన్ పూర్తిగా విజయవంతమవుతుందా..? అనే సందేహం మొదలైంది. ఈ కొత్త HIV వ్యాక్సిన్ మొదటి ట్రయల్ అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో నిర్వహించారు.