Bomb Threat : హైదరాబాద్ నగరంలోని హైఅలర్ట్ ప్రాంతాల్లో ఒకటైన పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో మంగళవారం ఉదయం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఈ ఘటనతో కోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భద్రతా దళాలు, పోలీసులు అప్రమత్తమవుతూ, కోర్టులోని అన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఫోన్ కాల్ వస్తూనే అధికారులు ఎలాంటి ప్రమాదం జరుగకుండా అతి వేగంగా స్పందించారు. చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టును వెంటనే ఖాళీ చేయించి, తనిఖీలకు అనుమతిని…