హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా కొత్త పద్ధతులతో పోలీసులను తప్పుదోవ పట్టిస్తోంది. సాధారణంగా కనిపించే వస్తువుల మాటున డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ యువతను బారిన పడేస్తోంది. పుస్తకాలు, కాస్మెటిక్స్, తినుబండారాలు, ఫుడ్ ఆర్టికల్స్ వంటి వస్తువుల మధ్య దాచిపెట్టి ముఠాలు డ్రగ్స్ పంపిణీ చేస్తున్నాయి.