Drugs : హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా కొత్త పద్ధతులతో పోలీసులను తప్పుదోవ పట్టిస్తోంది. సాధారణంగా కనిపించే వస్తువుల మాటున డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ యువతను బారిన పడేస్తోంది. పుస్తకాలు, కాస్మెటిక్స్, తినుబండారాలు, ఫుడ్ ఆర్టికల్స్ వంటి వస్తువుల మధ్య దాచిపెట్టి ముఠాలు డ్రగ్స్ పంపిణీ చేస్తున్నాయి. ఇప్పటివరకు పోలీసులు బయటపెట్టిన వివరాల ప్రకారం దాదాపు 38 రకాల వస్తువుల రూపంలో డ్రగ్స్‌ను తరలిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఈ ముఠాలు విశ్వవిద్యాలయాలు, మెడికల్ కాలేజీలు, హాస్టళ్లలోకి కూడా డ్రగ్స్ చొరబెడుతున్నాయి.
Auqib Nabi: ఆకిబ్ నబీ సంచలన బౌలింగ్.. దులీప్ ట్రోఫీ చరిత్రలో ఇదే మొదటిసారి!
మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థులకు పుస్తకాల రూపంలో డ్రగ్స్ సరఫరా చేయడం, మెడికల్ కాలేజీ విద్యార్థులకు కాస్మెటిక్స్ బాక్స్‌లలో డ్రగ్స్ పంపడం, వ్యాపారవేత్తలకు ఫుడ్ ఐటమ్స్ రూపంలో డ్రగ్స్ చేరవేయడం వంటి సంఘటనలు వెలుగుచూశాయి. అంతేకాదు, కూరియర్ సర్వీసుల ద్వారా కూడా డ్రగ్స్ తరలించడం ముఠాల కొత్త ట్రిక్‌గా మారింది. పార్సిల్ రూపంలో పంపించే వస్తువులు వాస్తవానికి సింథటిక్ డ్రగ్స్‌గా మారిపోతున్నాయి. ఇక హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ కూడా పనిచేస్తున్నట్లు ఇటీవల బయటపడింది.
హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు సింథటిక్ డ్రగ్స్ పంపిన ఇద్దరు సోదరులు పట్టుబడటం ఈ ముఠాల అంతర్జాతీయ కనెక్షన్లను బహిర్గతం చేసింది. ఇలా డ్రగ్స్ సరఫరా పద్ధతుల్లో ముఠాలు పుష్ప సినిమాలో చూపించిన స్మగ్లింగ్ ట్రిక్స్‌కంటే మించి కొత్త మార్గాలు ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పుస్తకాల మధ్య, ఫుడ్ ఐటమ్స్‌లో, కాస్మెటిక్స్ రూపంలో డ్రగ్స్ పంపిణీ చేస్తూ మాఫియా యువత భవిష్యత్తుతో ఆడుకుంటోంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా, డ్రగ్స్ ముఠాల ఈ కొత్త తరహా వ్యూహాలు వారిని సవాల్‌కు గురి చేస్తున్నాయి.