యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరుగుతోంది. భారత్ తొలి మ్యాచ్‌లో యూఏఈపై ఘన విజయాన్ని సాధించింది. ఇక సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియాసిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టును వీడాడు. ఆసియా కప్ జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న సుందర్.. టోర్నమెంట్ మధ్యలోనే జట్టును వీడి ఇంగ్లండ్‌కు బయలుదేరారు. ఇంగ్లండ్ ప్రసిద్ధ కౌంటీ జట్టు హాంప్‌షైర్‌లో అతడు చేరాడు. 2025 ఛాంపియన్‌షిప్‌లో చివరి రెండు మ్యాచ్‌లు సుందర్ ఆడనున్నాడు.…