ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. తాజాగా ఏపీలో 1859 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19,88,910కి చేరింది. ఇందులో 19,56,627 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,688 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 13 మంది మృతిచేందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,595 మంది మృతిచెందారు. ఇక…
కరోనా మహమ్మారిపై ప్రపంచం పోరాటం చేస్తున్నది. కరోనా నుంచి ఇప్పటి వరకూ ఏ దేశం కూడా పూర్తిగా కోలుకోలేదు. తగ్గినట్టే తగ్గి కేసులు మరలా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దేశాల్లో టీకాలు వేగంగా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కొన్ని రకాల టీకాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ధికంగా అభివృద్ధి చెందిన దేశాలు ముందుగానే కోట్లాది డోసులు సమకూర్చుకున్నాయి. మధ్య, పేద దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇండియాలో…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71,030 శాంపిల్స్ పరీక్షించగా.. 1,869 మంది పాజిటివ్‌గా తేలింది… మరో 18 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 2,316 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,87,051కు చేరుకోగా.. రికవరీ కేసులు 19,55,052కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు…
ఇండియాలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. ప్రతిరోజు 30 నుంచి 40 వేల మధ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 38,353 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,36,511 కి చేరింది. ఇందులో 3,12,20,981 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 3,86,351 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 497 మంది మృతి చెందారు.…
ప్రపంచంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తగ్గిందిలే అనుకుంటున్న సమయంలో తిరిగి కరోనా విజృంభిస్తుండటంతో అన్నిదేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. సోమవారం రోజున యూఎస్‌లో ఏకంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. వ్యాక్సిన్ వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటం భయాందోళనలు కలిగిస్తోంది. అమెరికాలోని ఆర్కాన్సన్ రాష్ట్రంలో అత్యధిక కేసులు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నది. సోమవారం రోజున ఆ రాష్ట్రంలో 1376 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఇక అమెరికా తరువాత అత్యధిక కేసులు ఇరాన్‌లో నమోదవుతున్నాయి. సడలింపులు…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 494 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,50,353కి చేరింది. ఇందులో 6,38,410 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 8,112 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతిచెందినట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 3,831కి చేరింది. ఇక ఇదిలా…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 63,849 శాంపిల్స్‌ను పరీక్షించగా, 1461 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,85,182కి చేరింది. ఇందులో 19,52,736 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,882 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 15 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,564కి…
చైనాలో మళ్లీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది. మధ్యస్త, తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి రాజధాని బీజింగ్‌కు వచ్చే వారిపై నిషేదం విధించింది. కరోనా తీవ్రత ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే రైలు, రోడ్డు, విమాన మార్గాలపై కూడా నిషేదం విధించింది చైనా ప్రభుత్వం. ఎవరైనా సొంత వాహనాల్లో ఆయా ప్రాంతాల నుంచి రావాలనుకున్నా వారిని మధ్యలోనే నిలువరించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. మధ్యస్త, తీవ్రత…