ఏపీ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు… ఇవాళ పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులినెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 67,716 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,501 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 10 మంది మృతిచెందారు. మరోవైపు.. 24 గంటల్లో 1,697 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
ఇరాన్‌లో రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజు 50 వేలకు పైగా నమోదవుతుండటం అందోళన కలిగిస్తోంది. ఇక ఇరాన్‌లో అమెరికా, బ్రిటన్‌లకు చెందిన టీకాలను నమ్మడంలేదు. ఆ రెండు దేశాలు తయారు చేసిన టీకాలు నమ్మదగినవి కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతుండటంతో ఇరాన్ లో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్నది. వ్యాక్సిన్ లను బ్లాక్‌లో భారీ ధరలకు విక్రయిస్తున్నారు. అస్త్రాజెనకా వ్యాక్సిన్ ధర బ్లాక్‌లో 90 వేలకు పైగా పలుకుతున్నది. బ్లాక్‌లో ధరలు భారీగా…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 68,041 సాంపిల్స్ పరీక్షించగా.. 1,433 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 15 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1,815 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,97,102కు పెరగగా… రికవరీ కేసులు 19,67,472కు చేరాయి.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,686…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఇండియాలో 25,166 కేసులు నమోదవ్వగా, 437 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దాదాపు 5 నెలల తరువాత 25 వేల కేసులు నమోదవ్వడం విశేషం. ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.22 కోట్లకి చేరింది. తాజాగా కరోనా నుంచి 36,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్‌లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.14 కోట్లకు చేరింది.…
దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈరోజు నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అయ్యాయి. అనేక విశ్వ విద్యాలయాల పరీక్షలు కూడా ప్రారంభం అయ్యాయి. చాలా కాలం తరువాత తిరిగి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవడంతో సందడి వాతావరణం నెలకొన్నది. థర్డ్ వేవ్ ముప్పు ఉందనే వార్తలు వస్తున్నప్పటికీ, తల్లిదండ్రులు పిల్లలు బడికి పంపుతుండటంతో ప్రభుత్వాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, టీచర్లకు ఇప్పటికే వ్యాక్సిన్‌ను అందించారు. మిగిలిన కొంతమందికి కూడా వేగంగా వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక…
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,341 సాంపిల్స్ పరీక్షించగా.. 1,746 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 20 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,648 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,90,656 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,58,275 కి చేరింది..…
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా ఇండియాలో 40,120 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కి చేరింది. ఇందులో 3,13,02,345 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,85,227 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 585 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు 4,30,254 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ…
కరోనా మహమ్మారి మొదటి వేవ్‌ను సమర్ధవంతంగా ఎదర్కొన్న చాలా దేశాల్లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రజులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ భయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డౌన్ అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. 2020 లో కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియాలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కాన్‌బెర్రాలో భారీగా కేసులు బయటపడటంతో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈరోజు నుంచి…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో సాధారణ జీవనం ప్రారంభం అయింది. ఇక ఇదిలా ఉంటే, రాష్ట్రంలో కొత్తగా 453 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,51,288కి చేరింది. ఇందులో 6,39,456 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,137 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో ముగ్గురు…
దేశంలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దక్షిణాదిన కేరళతో పాటు అటు మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. మొదటివేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని తక్కువ కేసులతో బయటపడ్డ ఈశాన్య రాష్ట్రాలు సెకండ్ వేవ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడ కేసులు బయటపడుతున్నాయి. తాజారా మిజోరాం రాష్ట్రంలో 576 కొత్త కేసులు నమోదవ్వగా అందులో 128 మంది చిన్నారులు ఉండటం ఆందోళన…