తెలంగాణ వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రవాణా శాఖ కు సంబంధించిన లారీలు ఇతర వాహనాలు ఇబ్బంది లేకుండా స్థానిక జిల్లా రవాణా అధికారులు & కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమన్వయ, పర్యవేక్షణ అధికారులను నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే సమన్వయ అధికారిగా హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు. సికింద్రాబాద్, చార్మినార్ జోన్‌లకు హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీవత్స కోట.. ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్‌లకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి ప్రియాంక.. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్‌లకు జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్‌ను నియమించారు.
భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఏపీ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. భవనాల నిర్మాణాల కోసం అనుమతులిచ్చే శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు