శనివారం బీహార్లో చివరి దశ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే.. పోలింగ్ రోజున కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ కాన్వాయ్ పై దుండగులు గత రాత్రి తుపాకీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కేంద్రమంత్రి పాట్లీపుత్ర పార్లమెంటరీ నియోజకవర్గంలోని మసౌర్హి ప్రాంతంలో ఉన్నారు.
బీజేపీ తరుఫున మండి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్ కు నిరసన సెగ తగిలింది. సోమవారం హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి లోయలో ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లింది. ఈ క్రమంలో.. అక్కడి ప్రజలు 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా.. కంగనా రనౌత్, ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్‌ల కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త గాయపడ్డాడు. కంగనా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు…
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి బీభత్సం సృష్టించింది. చైనా డ్రైవర్ సహా ఐదుగురు ఇంజనీర్లు మృతి చెందారు. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.
PM Modi stopped his convoy for Ambulance: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి తన కాన్వాయ్‌ను రోడ్డు పక్కకి మళ్లించారు. ఈ ఘటన ఆదివారం (డిసెంబర్ 17) వారణాసిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెట్టింట హర్షం వ్యక్తమవుతోంది. ప్రధాని మోడీ అంబులెన్స్‌కు దారి ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అహ్మదాబాద్, హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలోనూ ప్రధాని…
బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా వీణవంక పర్యటనకు వెళ్ళి వస్తుండగా మానకొండుర్ మండలం లలితపూర్ లో ఈటల కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.
తోషాఖానా కేసు విచారణకు సంబంధించి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైందని పాక్ మీడియా వెల్లడించింది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి కాన్వాయ్ భారీ ప్రమాదానికి గురైంది. అతివేగంతో వెళుతున్న కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకున్నాయి.
మీర్పేట్ రహదారిపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. NSUI నాయకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేయ్యాలని డిమాండ్ చేశారు. మీర్పేట్లో కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని NSUI నాయకులు అందించే ప్రయత్నం చేశారు. మంత్రిని కలవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో కాన్వాయ్కి అడ్డుపడ్డారు. దీంతో మీర్పేట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా NSUI అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మీర్పేట్ స్టేషన్‌కు తరలించారు.…