మంగళూరులో భజరంగ్ దళ్, వీహెచ్‌పీ సభ్యులు నిరసన చేపట్టారు. ఒక కాన్వెంట్ స్కూల్‌లో హిందూ దేవుళ్లను అవమానించడం, విద్యార్థులను మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారంతో విద్యార్థులతో కలిసి మితవాద సంఘాలు నిరసనలు చేపట్టారు. కాథలిక్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు.. హిందూ దేవుళ్లను అవమానించడం, హిందూ మతానికి వ్యతిరేకంగా విద్యార్థుల మనస్సులను విషపూరితం చేయడం, ఇతర మతాలకు చెందిన విద్యార్థులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి కుట్ర పన్నుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.