లండన్‌లో అమెరికా రాయబారి కార్యాలయం దగ్గర అనుమానాస్పద ప్యాకేజీ తీవ్ర కలకలం రేపింది. దీంతో యూకే పోలీసులు అప్రమత్తమై శుక్రవారం ప్యాకేజ్‌ను నిర్వీర్యం చేశారు. ప్యాకేజీ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా ఎంబసీ వెల్లడించింది. మరోవైపు గాట్విక్ ఎయిర్‌పోర్టులో భద్రతాపరమైన ఘటన మరొకటి జరిగింది. దీంతో ఎయిర్‌పోర్టు దక్షిణ టెర్మినల్‌ను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కో, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.…