హైదరాబాద్ జీహెచ్ఎంసీ (GHMC ) కార్యాలయంలో కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు. బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు కమిషనర్‌ను కలిసేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో.. సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుని గేట్లకు తాళం వేశారు. ఈ క్రమంలో.. ఓ కాంట్రాక్టర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు.
పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అంబటి రాంబాబు సరైన సమాధానం చెప్పడం లేదని, చెప్పేదంతా తప్పుల తడకగా ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. డయా ఫ్రమ్ వాల్ ను చంద్రబాబు కడితే దానిని ఏమి చేయాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది. ప్రాజెక్ట్ పై ఎందుకు నిపుణులతో పరిశీలన చేయడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకున్నారు. గతంలో ప్రభుత్వం ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకుంది.…
నల్గొండ జిల్లాలో అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు మరమ్మతులు చేయకపోవడంతో మరింత అధ్వాన్నంగా తయారయ్యాయి.నిధులు సకాలంలో మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్ల మరమ్మత్తులు చేసేందుకు ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు గడువు లోపు పనులు చేయకుండానే చేతులెత్తేస్తున్నారు. దీంతో జిల్లాలో వంద కోట్ల విలువైన పనులకు బ్రేక్ పడ్డాయి. నల్గొండ జిల్లాలో 1835 కిలోమీటర్లు పనులు ఉన్నాయి. అందులో రాష్ట్ర రహదారులు 195 కిలోమీటర్లు కాగా మిగిలినవి జిల్లా రహదారులు 1636 కిలోమీటర్లు.ఈ…
రహదారుల మరమ్మత్తులు, పునరుద్ధరణ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అధికారులకు కీలక సూచ నలు చేశారు. రాష్ర్టంలో రహదారుల మరమ్మత్తులు ఒక డ్రైవ్‌లా చేప ట్టాలని సూచించారు. రాష్ట్రంలో రహదారుల పై ఉన్న గుంతలు తక్ష ణమే పూడ్చాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తులపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం కోరారు.…