థాయ్‌లాండ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా స్రెట్టా థావిసిన్ ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.