ఖాకీ దుస్తులు ధరించి సమాజానికి సేవ చేయాలనే యువకుడి కల నెరవేరలేదు. ఆశయ సాధనలో ఓడిపోయానని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మూడు మార్కులు తక్కువ వచ్చినందుకు వరంగల్ జిల్లాకు చెందిన జక్కుల రాజ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.