Japan: గత శతాబ్ధకాలంలో మారని చట్టాలను జపాన్ తాజాగా మార్చింది. ప్రపంచంలో అతితక్కువ సెక్స్ సమ్మతి వయసు ఉన్న జపాన్ ఇప్పుడు దాన్ని పెంచింది. సెక్స్ వయోపరిమితిని 13 ఏళ్ల నుంచి 16కి పెంచింది. దీంతో పాటు అత్యాచారాన్ని పునర్నిర్వచించింది. శుక్రవారం జపాన్ పార్లమెంట్ సెక్స్ క్రైమ్ చట్టాలను సవరించింది. మానవహక్కుల సంఘాలు ప్రభుత్వం చర్యలను స్వాగతించాయి. ప్రస్తుతం 16 ఏళ్ల కన్నా తక్కువ వయసులో ఏదైనా లైంగిక చర్యలకు పాల్పడితే దాన్ని అత్యాచారంగా పరిగణిస్తామని నిబంధనలు…