ఓయూ ముట్టడి ఘటనలో అరెస్టైన ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులను పరామర్శిచేందుకు వెళ్లిన జగ్గారెడ్డిని సైతం పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. జగ్గారెడ్డిని కలిసేందుకు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో గీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ యూనివ్సిటీకి వస్తే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ నీ సీఎం చేసిందే విద్యార్దులు అని, విద్యార్ధుల దగ్గరకు…