PM Modi- Indira Gandhi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత రాజకీయాల్లో మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారు. నేటితో (జూలై 25, 2025) ఆయన 4,078 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇందిరా గాంధీ 4,077 రోజులు నిరంతరం ప్రధానమంత్రిగా ఉన్న రికార్డును అధిగమించారు. ప్రస్తుతం మోడీ దేశంలో అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన రెండవ ప్రధానమంత్రిగా రికార్డుకెక్కారు.