ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఖర్గే కోరారు. క్రమశిక్షణ లేని నాయకులను నియంత్రించాలని కోరుతున్నానని.. భారతీయ రాజకీయాలు పతనం కాకుండా ఉండాలంటే తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్‌లో సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఇక ఇండియా కూటమి నేతలు ఆరోపణలు గుప్పించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఖర్గే ఇంట్లో ఈ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలంతా చర్చిస్తున్నారు.