Rakesh Rathore: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అత్యాచార కేసులో ఈ రోజు అరెస్టయ్యారు. సీతాపూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాకేష్ రాథోడ్ విలేకరులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. గత నాలుగు ఏళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఉత్తర్ ప్రదేశ్ యూనిట్ జనరల్ సెక్రటరీగా ఉన్న రాథోడ్‌పై జనవరి 17న పోలీసులు కేసు నమోదు చేశారు.