వివాదాస్పద షియా ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల దాస్నా ఆలయంలో ఇస్లాం మతం వీడి హిందు మతం స్వీకరించారు. ఆలయ పూజారి యతి నర్సింహానంద సరస్వతి ఆచారాలను నిర్వహించి వసీం రిజ్వీని హిందు మతంలోకి మార్చారు. అయితే అనంతర రిజ్వీ పేరు జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మార్చినట్లు తెలిపారు. త్యాగిగా పేరు మార్చుకున్న రిజ్వీ మాట్లాడుతూ.. ఏ మతాన్ని అనుసరించాలనేది తన ఇష్టమని, కాబట్టి ప్రపంచంలోని…