Kerala Congress: కాంగ్రెస్ ఇరకాటం.. కేరళ మరో కర్ణాటక కాబోతోందా.?
- కేరళలో కాంగ్రెస్ ఇరకాటం..
- సీఎం పదవిపై మొదలైన వర్గపోరు..
- వీడీ సతీషన్, కేసీ వేణు గోపాల్, రమేష్ చెన్నితాల మధ్య సైలెంట్ వార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Congress: కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గద్దె దించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. కేరళలోని మొత్తం 140 స్థానాలకు గానూ యూడీఎఫ్ కూటమి 102 స్థానాలు గెలుచుకుంది. ఎల్డీఎఫ్ కేవలం 35 స్థానాలు సాధించింది. ఈసారి కేరళ అసెంబ్లీకి బీజేపీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 3 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్‌ను కొత్త సమస్య వేధిస్తోంది. కాంగ్రెస్ అంటేనే వర్గపోరు ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేరళలో కూడా తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌ల మధ్య అధికార పోరు తారాస్థాయికి చేరింది. వీరిద్దరి పంచాయితీ ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం వద్దకు వెళ్లింది. అయితే, దీనిపై అధిష్టానం ఎటూ తేల్చలేకపోతోంది. సరిగా ఇదే పరిస్థితి కేరళలో కూడా కనిపిస్తోంది.
Also Read
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
Read Also: Akhilesh Yadav: ఐప్యాక్‌తో అఖిలేష్ యాదవ్ తెగదెంపులు.. నమ్మకం పోయిందా? భయం పట్టుకుందా?
కేరళలో సీఎం పీఠాన్ని కాంగ్రెస్ నుంచి ముగ్గురు నేతలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా వీడీ సతీషన్, రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ పేర్లు ప్రముఖ్యంగా వినిపిస్తున్నాయి. వీరి అనుచరులు సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారరు. తదుపరి ముఖ్యమంత్రి వీడీ సతీషన్ అంటూ సోషల్ మీడియా ‘‘VDS’’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.
ఇదిలా ఉంటే, కేసీ వేణు గోపాల్‌కు మద్దతుగా ఆన్‌లైన్‌లో ప్రచారం ఊపందుకుంది. కొంత మంది యూజర్లు రమేష్ చెన్నితాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. మరొకొందరు కాంగ్రెస్ నేతలు తమ నాయకుడికి సీఎం పోస్టు ఇవ్వకపోతే పార్టీ నుంచి వైదొలుగుతామంటూ పోస్టులు పెడుతూ బెదిరిస్తున్నారు.
తాజావార్తలు
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!