సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్. బలమైన ప్రతిపక్ష నేత ఉన్నచోట ధీటైన అభ్యర్థి లేదా అధికార పార్టీ పార్టీ పటిష్టంగా ఉండాలని అనుకుంటారు. కానీ... గజ్వేల్ కాంగ్రెస్‌లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీని నడిపే సారథి కూడా ఆయనే. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన నర్సారెడ్డి ఆ…