Ponguleti Srinivas Reddy : ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ విచారణ సాగుతుందని దానిలో ప్రభుత్వ ప్రమేయం ఏమి ఉండదని, విచారణ అనంతరం నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంటున్నారు. మొన్న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ వెళుతుండగా అంత హంగామాచేయడం అవసరమా.. తాజాగా కూడా కేటీఆర్ విచారణ ను ఏదో జరగబోతున్నట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా హంగామా చేస్తున్నట్లుగా దృష్టికి వచ్చిందని పొంగులేటి అంటున్నారు. విచారణ ల తరువాత నివేదికల…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏసీబీ అధికారులు తనకు జారీ చేసిన నోటీసులపై స్పందించిన ఆయన, సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, పాలన చేయడం చేతకాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఒక్కో రోజు ఒక్కో డ్రామా వేస్తున్నాడు. ఈ చిల్లర కుట్రలతో మమ్మల్ని ఆపలేరు.…
Ponguleti Srinivas Reddy : పశువైద్యశాల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్నా అభివృద్ధి పనులు ఆపకుండా, ప్రజలకు సంక్షేమ పథకాలు నిరాటంకంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన జనాల పైనే రేవంత్ రెడ్డి తన ప్రతాపం చూపిస్తున్నారని.. హైడ్రా తో ఇళ్లను కూలగొట్టడం, రైతుల ధాన్యం కొనక పోవడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో యాసంగి పంట సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దేశంలో అత్యధిక వరి సాగు జరిగే రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు.
Minister Seethakka : ములుగు జిల్లా వెంకటాపూర్‌లో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కళ్లముందుంచుకుని పనిచేస్తుందని స్పష్టం చేశారు. పేదలకు నిత్యం తోడుగా నిలబడే సంకల్పంతోనే ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు. పేదింటి బిడ్డలకు సన్నబియ్యం అందిస్తే.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అసహనంతో రెచ్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. పేదల పట్ల ప్రభుత్వానికి…
Bhubharathi: ములుగు జిల్లా వెంకటాపురంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టుని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. భూభారతి చట్టం అమలులో పైలెట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాలోని వెంకటాపురం ఎంపిక చేయడం రెవెన్యూ మంత్రి శ్రీనాన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భూమి అనేది ఒక ఆత్మబలం, ఒక ఆదాయం.. గత ప్రభుత్వం ధరణి పేరుతో దగా చేసిందని అన్నారు. గతంలో నిజమైన రైతులకు గత ప్రభుత్వంలో పట్టాలు కాకుండా…
Ponguleti Srinivas Reddy : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మాట్లాడుతూ, ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితమై పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రగతి భవన్‌ను జ్యోతి రావు ఫూలే భవనంగా మార్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇది ప్రజలకు గౌరవం ఇచ్చే ముఖ్యమైన చిహ్నంగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణిలో చోటుచేసుకున్న అవకతవకలన్నీ సరి చేయడం కోసం కొత్త భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు.…
Kishan Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వం, కోతల ప్రభుత్వమని, రైతు భరోసా లో కోతలు పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు ఎందరు ప్రభుత్వం దగ్గర డేటా ఉందని,…