దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు, ఈరోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 70 లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో రూ. తొమ్మిది వేల కోట్లు వారి ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. రైతు భరోసా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన మహాను భావుడు రాజీవ్ గాంధీ అన్నారు. వ్యవసాయం అంటే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటే వ్యవసాయమని తెలిపారు. రైతులకు మద్దతు ధర ఇచ్చింది…
TPCC Mahesh Goud : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాం హౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ అభ్యర్థుల కోసం ఇటువంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ప్రజలు ఫాం హౌస్ పాలన… గడీల పాలన కోరుకోవడం లేదన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించడంతో ఆయన…
Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలన విజయవంతంగా సాగిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా రూపొందించారని, కాంగ్రెస్ మాత్రం సామాజిక తెలంగాణ దృక్పథంతో ముందుకు సాగుతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహం రైతు బిడ్డ రూపంలో…
Shabbir Ali : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజక వర్గ అబివృద్ధికి 27 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 54000 వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. గ్రూప్ పరీక్షలు పేపర్ లీక్ లేకుండా యధావిధిగా నడిపించినామన్నారు షబ్బీఆర్ అలీ. కేటీఆర్, హరీష్ లు…
TPCC Mahesh Goud : రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించిందని, దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసి చూపించామన్నారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అనేక పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు చేసి చూపించారని ఆయన వ్యాఖ్యానించారు. 18 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, ఆర్టీసీ ఉచిత…