అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో జమ్మూలో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని జమ్మూ కాశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కోటి రూపాయలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతని కోసమని క్రైమ్ బ్రాంచ్ అనేక నగరాల్లో వెతుకులాట ప్రారంభించి చివరికి నిందితుడిని అరెస్ట్ చేశారు.