గతంలో ఎప్పుడూ లేనంతగా బంగారం ధరలు ఈ ఏడాది రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. వేలకు వేలు పెరుగుతూ కొనుగోలుదారులకు వణుకుపుట్టించాయి. అయినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తగ్గలేదు. భారతదేశ బంగారం దిగుమతులు అక్టోబర్‌లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, దేశం అక్టోబర్ 2025లో $14.72 బిలియన్ల (సుమారు రూ. 1,30,411 కోట్లు) విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇది గత ఏడాది అక్టోబర్‌లో $4.92 బిలియన్ల (సుమారు రూ. 43.58 వేల కోట్లు)…