పేదరికం కారణంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆర్యన్ రోషన్ గురించి వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ స్పందించారు. శుక్రవారం నాడు ఆ విద్యార్థిని కలెక్టరేట్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ మను చౌదరి పిలిపించారు. ఐఐటీ తిరుపతిలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో సీటు పొందిన ఆర్యన్ రోషన్‌కు సెమిస్టర్ ఫీజు నిమిత్తం రూ.36,750 చెక్కును అందజేశారు. అలాగే చదువు అవసరాల నిమిత్తం రూ. 40,500 విలువైన ల్యాప్ టాప్‌ను కూడా కొనిచ్చారు.