స్క్రాప్‌ల విక్రయం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత కొన్నేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 3 ఏళ్లలో స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 2,364 కోట్లను ఆర్జించినట్లు పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (DPIIT) తెలియజేసింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వెలువడిన వ్యర్థాలు విక్రయించారు.
రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్లాజాలో ధర కంటే ఎక్కువ టోల్ ట్యాక్స్ వసూలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. రూ.1900 కోట్లతో నిర్మించిన రోడ్డుపై రూ.8000 కోట్ల టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేశారో, ఎలా వసూలు చేశారో ఓ న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సవివరంగా వివరించారు.