విజయవాడలోనూ ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది.. దీంతో.. విజయవాడ సున్నపు బట్టీల సెంటర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి... ఈ ఘటనలో ఓ ఇల్లు కూలిపోయింది.. నలుగురురికి తీవ్రగాయాలు అయినట్టు చెబుతున్నారు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని రెండు చోట్ల ఇళ్లు కూలాయి.. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. రెండు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు సిబ్బంది.. శిథిలాల్లో తొమ్మిది మంది చిక్కుకోగా.. వారిని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు..