సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 14.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్ లో 14.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. మెదక్ జిల్లా శంకరంపేటలో 16.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా చలి తీవ్రత కాస్త తగ్గిడంతో ఊపిరి పీల్చుకున్న రాష్ట్ర ప్రజలకు మళ్లీ చలి గజగజ వణికిస్తోంది.