రాష్ట్రంలో రోజురోజుకూ మరింత చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కనిష్టస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతు పడిపోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరో 3 రోజుల పాటు తీవ్ర చలిగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కుమురం భీం జిల్లా గిన్నెధరిలో అత్యల్పంగా 3.5 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు…