GST Rate Cut Impact: జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఆటో కంపెనీల తర్వాత.. తాజాగా FMCG(ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించనున్నాయి. దేశంలోని అతిపెద్ద ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ యూనిలీవర్ (HUL), దాని ప్రసిద్ధ ఉత్పత్తులైన డబ్ షాంపూ, లైఫ్‌బాయ్ సోప్, హార్లిక్స్, కాఫీ, ఇతర వస్తువుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.