పారిస్ గేమ్స్‌లో వినేష్ ఫోగట్‌కు కోచ్‌గా ఉన్న వూలర్ అకోస్ ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడు. ఒలింపిక్ ఫైనల్‌కు ముందు రోజు రాత్రి బరువు తగ్గేందుకు.. వినేష్ దాదాపు ఐదున్నర గంటల పాటు వివిధ రకాల కసరత్తులు చేసినట్లు కోచ్ వూలర్ అకోస్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపాడు. ఈ సమయంలో ప్రాక్టీస్ తర్వాత చనిపోతుందేమోనని భయపడ్డామన్నాడు. తొలి ఒలింపిక్స్‌ను సాధించడానికి వినేష్ తన జీవితాన్ని లెక్క చేయలేదని కోచ్ తన పోస్ట్‌లో చెప్పాడు.