గుంటూరు : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వరుడిని ఇవాళ దర్శించుకున్నారు సోము వీర్రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్వేది రధం ధగ్ధం కేసులో ఇంత వరకు పురోగతిలేదని.. రామతీర్ధం ఘటనలో ఇంత వరకు ఏవిధమైన చర్యలూ లేవని తెలిపారు. అదే అంతర్వేదిలో చర్చిపై రాయిపడితే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపారని… జగన్ ప్రభుత్వ ప్రధాన అజెండా క్రిష్టియానిటీని డెవలప్ చేయడమే…
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం.. ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా మురళీధర్‌రెడ్డి, కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా చెవ్వూరి హరికిరణ్ ను బదిలీ చేశారు.. ఇక, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా వాడరేవు విజయచంద్‌ను నియమించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ మల్లికార్జున్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌గా ఎం హరిజవహర్‌లాల్‌ను బదిలీ చేసిన ఏపీ సర్కార్.. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్…
కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లతో పాటు విద్యాసంస్థలు అన్నీ మూతబడ్డాయి.. క్లాసులు ఆన్‌లైన్‌లోనే.. ఇక పరీక్షల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.. ఎందుకంటే.. పోటీ పరీక్షలు మినహా.. బోర్డు ఎగ్జామ్‌లతో పాటు అన్నీ రద్దు చేశారు. అయితే, కరోనా సెకండ్ వేవ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో.. స్కూళ్లను పున:ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూల్స్ రీఓపెనింగ్‌కు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..…
కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను క్రమంగా అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… వరసగా రెండో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం నిధులు జమ చేసేందుకు సిద్ధం అయ్యింది.. రేపు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్మును జమ చేయనున్నారు.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో సొమ్మును జమ చేయనున్నారు సీఎం జగన్.. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన…
తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి లబ్ధిదారులకు మధ్య దళారులే లేరు… ప్రతీ పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం.. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కొంచాడ గ్రామంలో హరితవనహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో దొరికింది దొరికనట్లు దోచుకుతిన్నారు.. ముఖ్యమంత్రి దగ్గర్నుంచి జన్మభూమి కమిటీల వరకూ గుటకాయస్వాహా చేశారు.. వాళ్లకే సరిపోకపోతే ఇక ప్రజలకేం పంచుతారు అంటూ ఆరోపణలు…
అమరావతి : కరోనా కట్టడిపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎ జగన్ తాజా నిర్ణయం ప్రకారం… రాష్ట్రంలో కోవిడ్ కట్టడి ఆంక్షలు కొనసాగడంతో పాటు…. మరో పది రోజుల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు వరకు ఈ కర్ఫ్యూ అమలు కానుంది. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని సీఎం జగన్ ఆదేశించారు. read also : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక..…
అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆళ్లగడ్డలో ఇష్టం వచ్చినట్టుగా పన్నుల వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత భూమా అఖిలప్రియ.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. అకౌంట్లలో నగదు వేస్తే ప్రజలు నోరు మూసుకుని ఉంటారని ప్రభుత్వం నీచమైన ఆలోచన చేస్తోందంటూ ఆరోపించారు.. ప్రభుత్వం మున్సిపాలిటీలను అ భివృద్ధి చేయకుండా పన్నులు మాత్రం విపరీతంగా పెంచుతోందని, ప్రజలపై భారం మోపి ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలోని షాపులకు ప్రభుత్వం మూడేళ్లకు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత.. పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు.. ప్రజా సంఘాలు వీరికి మద్దతుగా నిలుస్తుండగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. నిరుద్యోగుల ఆందోళనకు అండగా ఉంటామని ప్రకటించారు.. పవన్‌ను కలిసిన నిరుద్యోగ యువత వారి ఆవేదనకు ఆయనకు తెలియజేశారు.. దీంతో, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది జనసేన పార్టీ.. రేపు ఏపీలోని అన్ని ఎంప్లాయిమెంట్ ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసైనికులకు పిలుపునిస్త ఓ…
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి పనులు పురోగతిపై ఆరా తీయగా… ఇవాళ మరోసారి పోలవరం డ్యామ్ సైట్‌కు వెళ్లారు.. స్పిల్‌వేపైకి వెళ్లి స్వయంగా జరిగిన పనుల్ని పరిశీలించిన సీఎంకు.. స్పిల్‌వేపై ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు వివరించారు..రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో…